ఈ ఆకుతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసుకోండి

ఈ ఆకుతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసుకోండి

ఆకుకూరల్లో ఎన్ని రకాలు ఉన్నా పొన్నగంటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఈ కూరలో ఉన్న పోషకాలు మరి ఏ ఆకుకూరలోను లేవు.పొన్న గంటి కూర ల విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి.

 Amazing Health Benefits Of Ponnaganti Koora Ponnagantikoora , Health Benefits-TeluguStop.com

అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా అధిక మొత్తంల ఉంటాయి.తోటకూర మాదిరిగానే ఈ ఆకుకూరతో కూడా అనేక రకాల వంటలన చేసుకోవచ్చు.

ఆ ఆకుకూర రుచి కూడా బాగుంటుంది.అందువల్ల పప్పు లేదా ఇతర కూరలతో కలిపి వండుకోవచ్చు.

పొన్నగంటి కూరలో విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

పొన్నగంటి కూరలో ఉన్న పోషకాలు కంటికి చాలా మేలు చేస్తాయి.

అంతేకాక రక్తహీనతను అరికడుతుంది.అందువల్ల రక్తం తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మొలలతో బాధ పడేవారికి పొన్నగంటి కూర ఆకులు, ఉల్ల్లిపాయలు, మిరియాలత చేసిన సూప్ త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది.పొన్నగంటి కూర లో లభించే నూనే పదార్ధాలు అధిక రక్త పోటున తగ్గిస్తాయి,అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.

పొన్నగంటి ఆకులు నిద్ర లేమి సమస్యతో బాధపడేవారికి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది, అలాగే జ్ఞాపక శక్తి ని పెంచటంలో సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube