మళ్లీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ బయలుదేరిన అల్లు అర్జున్.. ఈసారి ఎక్కడికి వెళ్లారంటే?

మళ్లీ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ బయలుదేరిన అల్లు అర్జున్.. ఈసారి ఎక్కడికి వెళ్లారంటే?

ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

 Allu Arjun Flew To Tanzania With Family And Friends For A Holiday ,allu Arjun, A-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లోనూ అల్లు అర్జున్ క్రేజ్ ని మరింత పెంచింది.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి రెడీగా ఉన్నాడు.

పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో పుష్ప 2 సినిమా మీద దర్శకుడు మరింత కాన్సన్ట్రేట్ చేశాడు.దీంతో స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Allu Arha, Allu Arjun, Alluarjun, Friends Holiday, Foreign Tours, Sneha Reddy, T

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.గతంలో అల్లు అర్జున్ ఎక్కువగా ఫారిన్ టూర్స్ కి వెళ్లేవాడు కాదు.కానీ ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇటీవలే తన పెళ్లి రోజు వేడుకలను జరుపుకోవడానికి భార్య పిల్లలతో కలిసి విదేశాలకు యాత్రకు వెళ్లిన బన్నీ ప్రస్తుతం కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి మరొకసారి విదేశీయాత్రకు వెళ్లినట్లు సమాచారం.

బన్నీ ప్రస్తుతం టాంజానియాలో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Allu Arha, Allu Arjun, Alluarjun, Friends Holiday, Foreign Tours, Sneha Reddy, T

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే పుష్ప2 సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అంతే కాకుండా ఈ సినిమా కోసం కొంతమంది కొత్త నటీనటులను కూడా తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త నటీనటుల కోసం ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం షూటింగ్ మొదలు కావటానికి ఇంకా ఎంత కాలం పడుతుంది అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube