ఎన్టీఆర్‌ : అల్లు అర్జున్‌ తప్పించుకున్నాడంటూ ఫ్యాన్స్ హ్యాపీ

ఎన్టీఆర్‌ : అల్లు అర్జున్‌ తప్పించుకున్నాడంటూ ఫ్యాన్స్ హ్యాపీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు నేడు.ఈ సందర్బంగా ఆయన 30వ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

 Allu Arjun Fans Happy With Ntr 30 Movie , Allu Arjun , Flim News, Koratala Shiva-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ 30 కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయిన తర్వాత అల్లు అర్జున్ గురించిన చర్చ ఒకటి మొదలు అయ్యింది.ఎన్టీఆర్‌ 30 గురించి అంచనాలు భారీ గా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా కొరటాల శివ ఈ సినిమాను చేస్తాను అంటున్నాడు.అయితే ఆయన గత చిత్రం ఆచార్య మరీ దారుణమైన పరాజయం పాలయ్యింది.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసినా ఆచార్య సినిమా ప్లాప్ తో ఒక్కసారిగా కొరటాల శివ గ్రాఫ్ కిందకు పడి పోయింది.ఆయన గతంలో అపజయం లేకుండా ముందుకు దూసుకు పోతున్నాడు.

అలాంటిది ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.అయితే ఎన్టీఆర్‌ మాత్రం నమ్మకంతో ఆయనకు ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా కథ ను గతంలో అల్లు అర్జున్ కు చెప్పాడు అనేది టాక్‌.

అప్పట్లోనే ఒక ప్రీ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

ఆ సమయంలో చాలా మంది బన్నీ తో ఎప్పుడెప్పుడు కొరటాల శివ సినిమా ఉంటుందా అంటూ ఆశించారు.ఎదురు చూస్తున్న సినిమా గురించి ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఎందుకంటే గతంలో ఆచార్య ప్లాప్‌ పడటం తో మళ్లీ అలాంటి ప్లాప్ పడటం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.అందుకే కొరటాల శివ తో బన్నీ సినిమా చేయక పోవడం పట్ల బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఒక వేళ ఎన్టీఆర్‌ 30 సినిమా సూపర్‌ హిట్‌ అయితే అప్పుడు బన్నీ ప్యాన్స్ స్పందన ఏంటో చూడాలి. ఎన్టీఆర్‌ 30 సినిమా విషయంలో నందమూరి అభిమానులు కూడా ఒకింత ఆందోళనతో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube