టైటిల్ మార్చుకున్న రకుల్ ప్రీత్.. ఏ సినిమాకంటే?

Ajay Devgn And Rakul Preet Singhs Film Now Called Runway 34

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ముంబై చెక్కేసింది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన ఫొటోలతో అందాల విందు చేస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతుంది.

 Ajay Devgn And Rakul Preet Singhs Film Now Called Runway 34-TeluguStop.com

ఇండస్ట్రీ కి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఈ అమ్మడికి అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఇంతకు ముందు ఈ అమ్మడు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.

 టైటిల్ మార్చుకున్న రకుల్ ప్రీత్.. ఏ సినిమాకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో చిన్న హీరోలతో కూడా నటిస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.ఇక బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి బాగానే అవకాశాలు వస్తున్నాయి.

అక్కడ కూడా వరుస ఆఫర్లను పడుతుంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ.

Ajay Devgan, Ajaydevgn, Bollywood, Day, Run-Movie

ప్రెసెంట్ రకుల్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమాల్లో అజయ్ దేవగన్ సినిమా కూడా ఉంది.ఈయన సినిమాలకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు.ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాల్లో మేడే సినిమా ఒకటి.ఇంతక ముందే వీరిద్దరూ కలిసి నటించారు.‘దే దే ప్యార్ దే‘ సినిమాతో తొలిసారి 2019లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Ajay Devgan, Ajaydevgn, Bollywood, Day, Run-Movie

అయితే వీరిద్దరూ ఇప్పుడు చేస్తున్న మేడే సినిమా టైటిల్ మారిపోయినట్టు స్వయంగా అజయ్ దేవగన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ సినిమా టైటిల్ ను ‘రన్వే34′ గా మారుస్తున్నట్టు అజయ్ తెలిపాడు.అయితే ఎందుకు టైటిల్ చేంజ్ చేస్తున్నారో తెలపలేదు.ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.రకుల్, అమితాబ్ ఇద్దరు ఈ సినిమాలో పైలెట్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను స్వయంగా అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

త్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది.

#Run #Ajay Devgan #Day #AjayDevgn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube