పుష్ప సీన్ రీల్ చేసిన సురేఖా వాణి, సుప్రీత.. మీ అమ్మాయికంటే మీరే బాగున్నారు అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సహాయ నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.ఈమె తెలుగులో పలు సినిమాలలో అక్కగా, వదినగా పలు పాత్రల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Actress Surekha Vani And His Daughter Supritha Repeat Pushpa Cinema Seen, Actress Surekha Vani, Supritha, Tollywood, Social Media-TeluguStop.com

ఒకప్పుడు ఈమె కేవలం సహాయ నటిగా మాత్రమే పరిచయం.కానీ ఇప్పుడు ఈమె ఒక ట్రెండ్ అనే చెప్పాలి.

ఎందుకంటే ప్రస్తుతం తాను సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది.అంతేకాదండోయ్ సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

 పుష్ప సీన్ రీల్ చేసిన సురేఖా వాణి, సుప్రీత. మీ అమ్మాయికంటే మీరే బాగున్నారు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత కొన్ని రోజుల నుండి సురేఖవాణి సోషల్ మీడియా కు బాగా అలవాటు పడింది.ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతుంది.

అంతేకాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేసింది సురేఖవాణి.పొట్టి పొట్టి బట్టలు వేసి అందరికీ షాక్ అయ్యేలా చేస్తుంది.లేటు వయసులో కూడా అందాల విందు వడ్డిస్తుంది.తనేంటో తన ఎనర్జీ ఏంటో ఇన్స్టాగ్రామ్ ద్వారా నిరూపించింది.నిజానికి సురేఖవాణి అందాలను, తన ఎనర్జీ ని చూసి నెటిజన్లు బాగా షాక్ అయ్యారు.

ఇక సురేఖ వాణి కు తన ఎత్తు కూతురు కూడా ఉంది.

తన పేరు సుప్రీత.ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం లేని సుప్రీత కేవలం తన తల్లి హోదాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.పైగా ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

ఇక ఈమె కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన తల్లి కి పోటీ పడుతూ ఉంటుంది.నిజానికి సురేఖ వాణిని, సుప్రీత ని చూస్తే తల్లి కూతురంటే ఎవరు నమ్మరు.

ఇద్దరు చూడటానికి అచ్చం అక్కచెల్లెలా కనిపిస్తారు.ఇద్దరు కలిసి తెగ స్టెప్ లు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.

కొన్ని కొన్ని సందర్భాలలో వీరిద్దరు నెటిజన్ల నుండి నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి తన కూతురుతో కలిసి పుష్ప సీన్ రీల్ చేసింది.దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పంచుకోగా అందులో సుప్రీత కంటే సురేఖ వాణి స్లిమ్ గా, అందంగా కనిపించింది.

దీంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా.ఆ వీడియోను చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.

అంతేకాకుండా తమ అందాలను పొగుడుతూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక ఓ నెటిజన్ మీ అమ్మాయి కంటే మీరే యంగ్ గా కనిపిస్తున్నారు మేడం అంటూ సురేఖ వాణి అందాన్ని పొగిడారు.

ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక కొందరు నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube