ఈవారం చిన్న సినిమాలన్నీ భారీ ప్లాప్.. బాక్సాఫీస్ దగ్గర డెడ్ ఓపెనింగ్స్..

క్రేజీ అప్డేట్ : సాయి పల్లవి ‘గార్గి’లో భాగం అవుతున్న సూర్య – జ్యోతిక..

మన టాలీవుడ్ లో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం అందరికి స్పెషన్ నే.ఈమెకు హీరోల మాదిరిగా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

 Actor Suriya And Wife Jyothika S 2d Entertainment To Present Sai Pallavi Starrer-TeluguStop.com

అలా అని ఈమె చాలా సినిమాలు చేసింది అని అనుకోకండి.ఈమె చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం అందరికి ఫెవరెట్ యాక్ట్రెస్.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటా.ఈమె మరెవరో కాదు.

ఫిదా తో అందరిని ఫిదా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్న ముద్దు గుమ్మా సాయి పల్లవి.

ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

ఇక ఇప్పుడు విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారనే చెప్పాలి.అద్భుత మైన నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి మరొక క్రేజీ కాంబోతో కలిసి మరోసారి సందడి చేయడానికి రాబోతుంది.

ప్రెసెంట్ సాయి పల్లవి గార్గి సినిమా చేస్తుంది.

ఇటీవలే సాయి పల్లవి పుట్టిన రోజు నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేసారు.ఈ సినిమా ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతుంది.

తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి పల్లవి సంప్రదాయంగా చీర కట్టుకుని బ్యాగ్ తగిలించుకుని సాధారణ యువతి లాగా కనిపించి మరోసారి ఫిదా చేసింది.

Reveal, Gargi, Jyothika, Sai Pallavi, Suriya, Tollywood-Movie

ఇక తాజాగా ఈ సినిమా కొత్త అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక భాగం కానున్నారని తెలిపారు.సూర్య, జ్యోతిక తమ ప్రొడక్షన్ హౌస్ 2డి పిక్చర్స్ సమర్పణలో తమిళ్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

వీరు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.అలాగే వీరి ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా కూడా తెలిపి మరింత హోప్స్ పెంచేశారు.

Reveal, Gargi, Jyothika, Sai Pallavi, Suriya, Tollywood-Movie

ఇలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను గౌతమ్ రామచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నారు.బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ ఐశ్వర్య లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube