ఈ పదేళ్లు చాలా వేస్ట్ చేశా.. రూ.కోట్లు సంపాదించేవాడిని కానీ ఇలా: నటుడు శివాజీ

ఈ పదేళ్లు చాలా వేస్ట్ చేశా.. రూ.కోట్లు సంపాదించేవాడిని కానీ ఇలా: నటుడు శివాజీ

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ముఖ్యపాత్రలో నటించిన శివాజీ ఆ తర్వాత కొద్దికాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరం ఉంటున్న విషయం తెలిసిందే.

 Actor Shivaji At Alluri Teaser Launch Video Goes Viral Details,  Actor Sivaji, T-TeluguStop.com

అయితే చాలా కాలం తర్వాత శివాజీ మరొకసారి వేదికపై కనిపించారు.సినిమాలకు బాయ్ బాయ్ చెప్పేసిన శివాజీ ఆ తర్వాత పొలిటికల్ పరంగా బిజీ బిజీ అయిపోయారు.

ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న అల్లూరి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దశకత్వం, బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

కాగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా తాజాగా ఈ అల్లూరి సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ సినిమాలో శ్రీ విష్ణు పవర్ ఫుల్ పోలీస్ గా టైటిల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లూరి సినిమా అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణ గుర్తొస్తారు.ప్రతి భారతీయుడులోనూ దేశభక్తిని రచించిన సినిమా అది.ఈ సినిమా నిర్మాత గోపి చాలామందిని పరిచయం చేశారు.నేను గోపినే పరిచయం చేశాను అని చాలా ధైర్యంగా చెబుతాను ఎందుకంటే గోపి సినిమా మీద సూపర్ స్టార్ కృష్ణ గారి మీద అభిమానంతో వాక్యం పేట నుంచి హైదరాబాద్ వచ్చారు.అలా అనుకోకుండా ఒకరోజు ఇండస్ట్రీలో చీకటి రోజున నన్ను కలిశాడు.

ఆ తర్వాత ఇద్దరం చీకటి నుంచి వెలుగులోకి వచ్చాం.అలా గోపి ప్రతి ఒక్క సినిమా కథను నాకు వినిపిస్తాడు.అందులో కొన్ని కథలు వద్దని చెప్పాను.అలాంటి వాటిలో నేను నాన్న బాయ్ఫ్రెండ్ సినిమా కూడా ఒకటి.ఆ సినిమా విడుదల అయ్యి పరాజయం పాలయ్యింది.ఆ తరువాత తాజాగా అల్లూరి సినిమా కథను చెప్పాడు ధైర్యంగా గుండెలపై చేయి వేసుకొని సినిమా చేయవచ్చు అని తెలిపారు అని చెప్పుకొచ్చాడు శివాజీ.

ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేదు.

ఇలాంటి భావనలతోనే నేను సినిమాలకు దూరం అయ్యాను.నా కెరియర్ లో చివరి సినిమా బూచమ్మ బూచాడు అని తెలిపాడు శివాజీ.తన కెరిర్ ని పాలెం బస్సు సంఘటన సినిమాలకు దూరం చేసిందని, అప్పటినుండి హ్యాపీగా సినిమాలు చేసి ఉంటే ఎంత వరస్ట్ సినిమాలు తీసిన తక్కువలో తక్కువ పది నుంచి 15 కోట్లు సంపాదించే వాడిని, కానీ ఇప్పటికి నేను ఫన్నీ ఆలోచించలేదు ఎందుకంటే ఈరోజుకు కూడా మన భారతదేశంలో పాలెం బస్సు దగ్గరే ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు శివాజీ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube