‘గని’ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని.అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

 A Wonderful Response To Milky Beauty Tamanna's Special Song In 'gani', 'gani, Varun Tej , Tollywood , Tamanna , Special Song, Harika Narayan , Kiran Korra Paati-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఐటం సాంగ్ చేసారు.

ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది.యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

 ‘గని’ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు.హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది.

తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ.ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు.సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. జనవరి 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు:

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

టెక్నికల్ టీమ్: దర్శకుడు: కిరణ్ కొర్రపాటి.నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద, సమర్పకుడు: అల్లు అరవింద్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, సంగీతం: థమన్ పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube