ఆత్మకూరు ఉప ఎన్నికలో 18 శాతం ఓట్లు మిస్సింగ్

ఆత్మకూరు ఉప ఎన్నికలో 18 శాతం ఓట్లు మిస్సింగ్

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ నేపథ్యంలో ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించగా ఆదివారం నాడు కౌంటింగ్ జరిగింది.

 18 Per Cent Votes Missing In Atmakur By-election Andhra Pradesh, Atmakur Bypoll,-TeluguStop.com

తొలి రౌండ్ నుంచే ఆధిక్యం సంపాదించిన వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి చివరకు 82,888 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్ యాదవ్‌కు డిపాజిట్ కూడా రాలేదు.

సెంటిమెంట్ ప్రకారం ఆత్మకూరు ఉప ఎన్నికలో టీడీపీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.అటు టీడీపీ, ఇటు జనసేన పోటీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థికి 19,352 ఓట్లు పోలయ్యాయి.

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి.ఇతరులకు 11, 496 ఓట్లు పోలవ్వగా.

నోటాకు 4,179 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వివరించారు.అయితే లక్ష మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు భావించగా అది సాధ్యం కాలేదు.

Andhra Pradesh, Ap Poltics, Atmakur Bypoll, Bharat Kumar, Mekapativikram, Telugu

ముఖ్యంగా ఆత్మకూరు ఉప ఎన్నికలో 64.17 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.అయితే 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకర్గంలో 82 శాతం పోలింగ్ జరిగింది.అంటే ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఏకంగా 18 శాతం పోలింగ్ తగ్గింది.దీంతో తమకు లక్ష మెజారిటీ రాలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.కానీ ఆ 18 శాతం ఓటు బ్యాంక్ ఏమైందన్న విషయంపై వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయకపోవడంతో టీడీపీ మద్దతుదారులు ఓటింగ్‌లో పాల్గొనలేదన్న చర్చ కూడా జరుగుతోంది.అటు జనసేన పార్టీ అభిమానులు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదని.

అందువల్లే గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అటు వైసీపీ నేతల మధ్య అంతర్గత కలహాలు కూడా వైసీపీకి ఓటింగ్ తగ్గడానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

కాగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube