హైదరాబాద్‌లో పొలిటికల్ వార్.. అటు మోదీ.. ఇటు యశ్వంత్ సిన్హా

హైదరాబాద్‌లో పొలిటికల్ వార్.. అటు మోదీ.. ఇటు యశ్వంత్ సిన్హా

హైదరాబాద్‌లో పొలిటికల్ వేడి రాజుకుంటోంది.ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది అన్నట్లుగా రాజకీయాలు మారిపోయాయి.

 Political Heat In Hyderabad While Modi And Yashwant Sinha Tours Telangana, Hyder-TeluguStop.com

దీనికి కారణం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.ఈ సమావేశాల కారణంగా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నేతలందరూ హైదరాబాద్‌లోనే మకాం వేశారు.

ఇప్పటికే అనురాగ్ ఠాకూర్, గిరిరాజ్ సింగ్ వంటి కేంద్ర మంత్రులు హైదరాబాద్ రాగా.శుక్రవారం బీజేపీ దళపతి జేపీ నడ్డా కూడా భాగ్యనగరం చేరుకోనున్నారు.

శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు.

మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా శనివారమే హైదరాబాద్‌కు వస్తున్నారు.

అటు మోదీ, ఇటు యశ్వంత్ సిన్హా ఒకేరోజు హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టనుండటంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.ఇద్దరు నేతలకు కూడా జడ్ ప్లస్ భద్రత ఉండడంతో హైదరాబాద్ ప్రజలకు ఇక్కట్లు.

దేశ ప్రజలకు ఉత్కంఠ కనిపిస్తున్నాయి.ఇప్పటికే మోదీ రాకకు కాషాయం పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

నగరాన్ని బీజేపీ ఫ్లెక్సీలతో నింపేశారు.

అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ మేరకు పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనపై నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు కేటీఆర్ ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు.

జూలై 2న ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి యశ్వంత్ సిన్హా చేరుకుంటారు.ఉదయం 11 గంటలకు జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ సభ నిర్వహించనున్నారు.

సభ తర్వాత.సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలతో కలిసి సిన్హా భోజనం చేస్తారు.

Hyderabad, Narendra Modi, Telangana, Yashwanth Sinha-Telugu Political News

ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిస్థితులు చూస్తుంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది.యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు 10వేలకు పైగా బైకులతో టీఆర్ఎస్ పార్టీ ర్యాలీ చేయనుంది.అటు తెలంగాణలో అధికారం చేపట్టడమే టార్గెట్ అన్న దిశగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది.అందుకే హైదరాబాద్‌నే బీజేపీ ఈ సమావేశాలకు వేదికగా ఎంచుకుందని ప్రచారం జరుగుతోంది.

విజయ సంకల్ప యాత్ర పేరుతో జూలై 3న బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.తన ప్రసంగంలో టీఆర్ఎస్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube