జామ ఆకులలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా

జామ పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు.అలాగే జామ ఆకులో ఎన్నో సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు.

జామ ఆకును ఉపయోగించి చర్మ సమస్యలు,జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.జామ ఆకులో యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మ సమస్యలు అన్ని తొలగిపోతాయి.

ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.బ్లాక్ హెడ్స్ తొలగించటానికి ప్యాక్ జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.

ఆ పేస్ట్ లో కొంచెం పసుపు వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.మొటిమలు, మచ్చలు తొలగించటానికి జామ ఆకుల్లో ఉండే యాంటీ-బాక్టీరియా మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

జామ ఆకులను నలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.ముడతలను తొలగించటానికి జామ ఆకుల్లో ఉండే లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ని తొలగించి వృద్దాప్య లక్షణాలు తొందరగా రాకుండా చేస్తాయి.

జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో ముడతలు తగ్గిపోతాయి.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!